: అమ్మ చనిపోయే ముందు మాతో మాట్లాడిన క్షణాలు మరచిపోలేను: ప్రిన్స్ హ్యారీ
సుమారు ఇరవై ఏళ్ల క్రితం ప్రిన్సెస్ డయానా, తన ప్రియుడు డోడి అల్ ఫయెద్ తో కలిసి కారులో వెళుతుండగా ఫొటోగ్రాఫర్ల కంట పడకుండా తప్పించుకునే క్రమంలో ఇద్దరూ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెంది ఇరవై ఏళ్లు కావస్తున్న సందర్భంగా ‘డయానా, అవర్ మదర్: హర్ లైఫ్ అండ్ లెగసీ’ పేరిట ఓ డాక్యుమెంటరీ తీయబోతున్నారు.
ఈ సందర్భంగా డయానా కుమారులు విలియం, హ్యారీ మీడియాతో మాట్లాడుతూ నాటి విషయాలను ప్రస్తావించారు. తమ తల్లి చనిపోయే కొన్ని గంటల ముందు తమకు ఫోన్ చేసిందని, అయితే, ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదని, కొద్ది సేపే మాట్లాడానన్న బాధ ఇప్పటికీ తనకు ఉందని ప్రిన్స్ హ్యారీ అన్నారు. కాగా, వచ్చే నెల 31న లండన్ లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ లో డయానా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.