: మహిళల వరల్డ్ కప్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్


లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ పై టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని మొదటి నుంచీ అంచనాలు వున్నాయి. తొలిసారి ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో మిథాలీ సేన ఉంది. 2005 తర్వాత ఫైనల్స్ కు చేరడం భారత్ కు ఇది రెండోసారి. నాటి ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. స్వదేశంలో మరోమారు కప్పు అందుకోవాలని ఇంగ్లాండ్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. మహిళల వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు చేరడం ఇంగ్లాండ్ జట్టుకు ఇది ఏడోసారి. మహిళల ప్రపంచకప్ లో ఇంతవరకూ మూడు సార్లు విజేతగా నిలిచింది.

  • Loading...

More Telugu News