: ఆన్‌లైన్ లాటరీ పేరుతో మోసం.. రూ.1.3 కోట్లు సమర్పించుకున్న బెంగళూరు దంపతులు!


లాటరీ పేరుతో వేసిన వలలో చిక్కుకున్న బెంగళూరుకు చెందిన దంపతులు విలవిల్లాడుతున్నారు. ఏకంగా రూ.1.34 కోట్లు సమర్పించుకుని ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేస్తున్నారు. జీకేవీకే అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త అల్లల సంద్ర  2014లో ఆన్‌లైన్ క్విజ్ వలలో పడ్డారు. తనకు ఐదు కోట్ల రూపాయల బహుమతి వచ్చిందని తెలియగానే దానిని సొంతం చేసుకునేందుకు పలు దఫాలుగా పెద్దమొత్తంలో చెల్లించుకున్నారు. అయితే 2014లో ఆయన మృతి చెందారు.

అయినప్పటికీ ఆ లాటరీ డబ్బులు సొంతం చేసుకునేందుకు ఆయన భార్య మోసగాళ్లు అడిగిన మొత్తం పంపించడం మొదలుపెట్టింది. అలా ఈ ఏడాది మధ్య వరకు పంపించింది. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న అల్లల సంద్ర భార్య (52) గత వారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతిపెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. తన భర్త చనిపోయిన తర్వాత మోసగాళ్లు తనతో మాట్లాడారని కోట్లాది రూపాయలు వస్తాయని తెలిసి బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తం సొమ్ముతోపాటు ఎల్‌ఐసీ పాలసీలపై రుణం తీసుకుని కూడా పంపానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News