: కోవింద్ తొలి పర్యటన అక్కడికే.. లడఖ్‌లోని ఆర్మీ పోస్టులను సందర్శించనున్న కొత్త రాష్ట్రపతి!


భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన లడఖ్‌లో పర్యటించనున్నారు. జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో ఈనెల 25న పర్యటించనున్న ఆయన అక్కడి ఆర్మీ స్థావరాలను సందర్శిస్తారు. భారత్-చైనా-తూర్పు పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం భారత్‌కు వ్యూహాత్మక ఆర్మీ స్థావరం. భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్మీ స్థావరాలను సందర్శించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, త్రివిధ దళాలకు రాష్ట్రపతి సుప్రీం కమాండర్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News