: ఏకధాటిగా సాగుతున్న సిట్ విచారణకు నేడు బ్రేక్!
గడచిన నాలుగు రోజులుగా ఏకధాటిగా సాగుతున్న సిట్ విచారణకు నేడు బ్రేక్ పడింది. తొలి రోజున పూరీ జగన్నాథ్, రెండో రోజున కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, మూడో రోజున నటుడు సుబ్బరాజు, నాలుగో రోజున తరుణ్ లను విచారించిన అధికారులు, నేడు ఆదివారం సెలవు తీసుకోనున్నారు. రేపు నటుడు నవదీప్ ను విచారించనున్నామని సిట్ అధికారి శీలం శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. తరుణ్ తమకు ఎంతో సహకరించాడని, ఆయన అనుమతితోనే రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్లను సేకరించామని ఆయన పేర్కొన్నారు. ఒకరోజు విరామం తరువాత, విచారణ సాగుతుందని అన్నారు.