: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!
టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హైదరాబాదు, అబిడ్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశామని రిటైర్డ్ ఎక్సైజ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మహబూబ్‌అలీ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అకున్ సబర్వాల్‌పై వర్మ వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు శిక్షార్హమేనని తేల్చి చెప్పారు. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం రామ్ గోపాల్ వర్మ అధికారులను బెదిరించేలా మాట్లాడారని పేర్కొన్నారు. అంతేగాక, సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా వర్మ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారని అన్నారు. డ్రగ్స్ కేసులో అనుమానం ఉన్న వారిని పిలిచి విచారిస్తారని ఆయన అన్నారు.