: ఈ రోజు ఉపవాసం ఉన్న హీరో తరుణ్!
టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఈ రోజు సినీ నటుడు తరుణ్‌ని అధికారులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. తరుణ్ ఈ రోజు ఉపవాసంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఉదయం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆహారం తీసుకోలేదని సమాచారం. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణలో డ్రగ్స్ వ్యవహారంలో ఆయనకేమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తరుణ్ చెప్పే వివరాలను రికార్డు చేస్తున్నారు.