: హీరోయిన్ ఛార్మీ విచారణకు వస్తానని చెప్పింది.. ఎఫ్‌క్లబ్ లైసెన్స్ రద్దు: సిట్ ప్రకటన
టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న మాదకద్రవ్యాల వ్యవహారంలో ఈ రోజు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిట్ అధికారులు మీరో తరుణ్‌ని ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా సిట్ అధికారులు ఈ కేసులో ప్రకటన చేశారు. ఈ కేసులో విచారణకు హాజరవుతానని హీరోయిన్ ఛార్మీ చెప్పిందని అన్నారు. సిట్ కార్యాలయంలోనే ఆమెను ప్రశ్నిస్తామని అన్నారు. ఆమెను ఈ నెల 26న విచారించనున్నారు. అలాగే, ఈ రోజు బార్లు, పబ్బుల యజమానులతో సమావేశమైన అధికారులు.. డ్రగ్స్ విషయంపై వారిని హెచ్చరించారు. ఎఫ్‌క్లబ్ లైసెన్స్ రద్ద చేసినట్లు సిట్ ప్రకటన చేసింది. అలాగే, 14 బార్లు, పబ్‌ల యజమానులను హెచ్చరించామని చెప్పింది.