: భారత క్రికెటర్‌పై దాడి చేసి.. కారు ధ్వంసం చేసిన దుండగులు


భారత క్రికెటర్‌ పర్వీందర్‌ అవానపై గ్రేటర్‌ నోయిడాలో నిన్న రాత్రి దాడి జరిగింది. ఓ యువ‌తి స‌హా ఐదురుగు వ్యక్తులు ఆయ‌న‌పై దాడికి దిగి, ఆయ‌న కారును ధ్వంసం చేసి పారిపోయారు. పర్వీందర్ టీమిండియా తరఫున 2012లో ఇంగ్లాండ్‌పై రెండు టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జ‌ట్టులో ఆడిన విష‌యం తెలిసిందే. త‌న‌పై దాడి జ‌రిగిన వెంట‌నే ఆయ‌న పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ప‌లు విష‌యాలు తెలుసుకున్నారు. పర్వీందర్‌పై దాడికి పాల్పడిన ఆ ఐదుగురు అంతకుముందు ఓ ఐస్‌ ఫ్యాక్టరీ వద్ద కొంతమందితో గొడ‌వ ప‌డ్డార‌ని తేల్చారు.

 అనంత‌రం వారు రోడ్డు మార్గంలో వెళుతుండ‌గా అదే ప్రాంతం గుండా క్రికెట‌ర్ ప‌ర్వీంద‌ర్‌ కారు వారిని దాటుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఆ కారు తమతో గొడవపడిన వ్య‌క్తుల‌దే అని భ్ర‌మ‌ప‌డిన ఆ దుండ‌గులు కారుని అడ్డుకుని స‌ద‌రు క్రికెట‌ర్‌పై దాడికి దిగారని పోలీసులు గుర్తించారు. ఆ దుండ‌గులు గ్రేటర్‌ నోయిడాలోని గంగోలా గ్రామానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

  • Loading...

More Telugu News