: మోదీ విందుకు హాజరుకానున్న నితీష్ కుమార్


ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ల మధ్య నానాటికీ సాన్నిహిత్యం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మోదీ తీసుకున్న పలు నిర్ణయాలకు నితీష్ మద్దతు ప్రకటించి, విపక్ష కూటమికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ ఇస్తున్న విందుకు నితీష్ హాజరుకానున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీడ్కోలు సందర్భంగా, ఆయన గౌరవార్థం ఈ సాయంత్రం ప్రధాని విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు నితీష్ హాజరవబోతున్నారు.

మరోవైపు ఈ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో కూడా నితీష్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబసభ్యులపై సీబీఐ, ఈడీల దాడులు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను పదవి నుంచి దిగిపోవాలంటూ సూచించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News