: మొరాకోలో సర్ఫింగ్ చేస్తున్న కత్రినా కైఫ్
`జగ్గా జాసూస్` సినిమా విడుదల తర్వాత కొద్దిగా విరామం దొరకడంతో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ హాలిడే ప్లాన్ చేసింది. ప్రస్తుతం మొరాకోలో జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆ అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తూనే ఉంది. ఇటీవల మొరాకోలో తాను సముద్రపు అలలపై సర్ఫింగ్ చేస్తున్న వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేసింది. `మొదటిసారి సర్ఫింగ్ చేస్తున్నా... ఎస్సారియాలో` అంటూ తన సర్ఫింగ్ వీడియోను పోస్ట్ చేసింది కత్రినా. ఈ హాలీడే తర్వాత సల్మాన్ ఖాన్‌తో కలిసి `ఏక్ థా టైగర్` సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న `టైగర్ జిందా హై` సినిమాలో కత్రినా నటించనుంది.