: ఇదో పెద్ద డ్రామా: 'బిగ్ బాస్'పై నటుడు శివబాలాజీ ఆగ్రహం!


జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' కార్యక్రమంలో నటుడు శివబాలాజీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బిగ్ బాస్ పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఒకసారి కేవలం ఒక వ్యక్తి మాత్రమే స్మోక్ రూమ్ (స్మోకింగ్ చేసే గది)లోకి వెళ్లాలి. ఈ నేపథ్యంలో ఒకేసారి ఐదుగురు ఆ గదిలోకి వెళ్లడాన్ని బిగ్ బాస్ తప్పుబట్టాడు. రూల్స్ బ్రేక్ చేశారంటూ వారికి పనిష్ మెంట్ ఇచ్చాడు. రోజువారీ వారికి ఇచ్చే సిగరెట్లను బంద్ చేశాడు. తన తదుపరి నిర్ణయం వెలువడేంత వరకు సిగరెట్లు అందించబోమని చెప్పాడు.

ఈ నిర్ణయాన్ని స్మోకింగ్ అలవాటు ఉన్న కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు గతిలేక ఈ షో చేయడానికి రాలేదని... బిగ్ బాస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడంటూ శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి ఇతర సభ్యులు ధన్ రాజ్, సమీర్ లు మద్దతు పలికారు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లను తాము ఎంతో నిబద్ధతతో చేస్తున్నామని... ఉల్లంఘనలకు ఇచ్చే శిక్షలను కూడా స్వీకరిస్తున్నామని... అయితే, ఇంత కఠినంగా బిగ్ బాస్ వ్యవహరించడం తమకు నచ్చలేదని మండిపడ్డారు. బిగ్ బాస్ ఇంత స్టుపిడ్ నిర్ణయం తీసుకుంటాడని తాము భావించలేదని వాపోయాడు. తామంతా సెలబ్రిటీలమేనని, ఎలా నడచుకోవాలో తమకు తెలుసని అన్నాడు.

ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తేసుకుని సిగరెట్లను అందించాడు. అయితే, ఒక కండిషన్ పెట్టాడు. ఒక వ్యక్తి స్మోక్ చేస్తున్నప్పుడు, మిగిలిన 13 మంది సభ్యులు బాత్రూమ్ లో ఉండాలని కండిషన్ విధించాడు. అయితే, మిగిలిన వారు బాత్రూమ్ లో ఉండాలనే నియమాన్ని ఎత్తివేయాలని బిగ్ బాస్ కు ధన్ రాజ్ సహా స్మోకింగ్ చేసే ఇతర సభ్యులు విన్నవించారు. మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News