: పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రాథమిక రిపోర్టులో వెల్లడి... నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిటింగ్!
డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఉస్మానియా ఆసుపత్రి డ్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్ మహ్మద్ రఫీ పూరీ జగన్నాథ్ నుంచి వెంట్రుకలు, చేతి, కాలిగోళ్లు సేకరించిన సంగతి తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ చాలా కాలం క్రితం డ్రగ్స్ వినియోగించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు ఆయన తెలిపారు. అయితే దీనిపై మరింత స్పష్టమైన ఫలితాల కోసం ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూడాలని ఆయన అన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అన్ని వివరాలు వెల్లడవుతాయని ఆయన చెప్పారు.