: దిగ్విజయ్ కు దమ్ముంటే డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతల పేర్లు బయటపెట్టాలి: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్


డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ దీటైన సమాధానమివ్వడమూ విదితమే. తాజాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దిగ్విజయ్ కు దమ్ముంటే డ్రగ్ రాకెట్ లో ఉన్న టీఆర్ఎస్ నేతల పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. దిగ్విజయ్ ఆ పని చేస్తే కనుక,  24 గంటల్లో విచారణ జరిపి వారిని అరెస్టు చేస్తామని అన్నారు. సినిమా వాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే డ్రగ్స్ వాడుతున్నారా? అని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు, గుడుంబా తయారీని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ నేతలే అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News