: సెక్యూరిటీ వాహనం లేకుండానే జగన్ రాజ్ భవన్ కు ఎందుకు వెళ్లారు?: దేవినేని ఉమ
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధినేత జగన్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నిన్న సాయంత్రం 4.45 గంటలకు జగన్ రహస్యంగా గవర్నర్ ను కలిశారు. సెక్యూరిటీ వాహనం లేకుండా రాజ్ భవన్ కు జగన్ ఎందుకు వెళ్లారో చెప్పాలి?’ అని ప్రశ్నించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారని చెప్పారు. ప్రాజెక్టుల విషయమై ప్రశ్నించిన రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈ సందర్భంగా దేవినేని ఘాటుగా సమాధానం చెప్పారు.