: కొందరి పేర్లు బయటపడ్డాయి.. సుబ్బరాజు విచారణ మరికొన్ని గంటలు ఉంది: అకున్ సబర్వాల్
డ్రగ్స్ కేసులో ఈ రోజు నటుడు సుబ్బరాజును విచారిస్తున్నామని, విచారణ ఇంకా ముగియలేదని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సుబ్బరాజు విచారణ ముగిసిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, సుబ్బరాజు విచారణ మరికొన్ని గంటలు ఉందని అకున్ సబర్వాల్ చెప్పారు. సుబ్బరాజుకి అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన విచారణకు సహకరిస్తున్నారని అన్నారు. విచారణ గురించి పూర్తి వివరాలు చెప్పడం కుదరదని అన్నారు. కెల్విన్ ముఠాతో టాలీవుడ్ నటులకి ఉన్న సంబంధాలపై సుబ్బరాజును ప్రశ్నిస్తున్నట్లు మాత్రం చెప్పారు. విచారణ ముగిసిన తరువాత అన్ని విషయాలు చెబుతామని తెలిపారు. ఈ రోజు విచారణలో కొన్ని పేర్లు బయటపడ్డాయని చెప్పారు. ఈ కేసులో సినీ నటులనే కాకుండా కొందరు వేరే వ్యక్తులను కూడా విచారించనున్నట్లు తెలిపారు.