: జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎం.సంజీవరెడ్డి
నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎం.సంజీవరెడ్డి ఈ రోజు సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో సంజీవరెడ్డికి వైసీపీ కండువా కప్పిన జగన్... ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. సంజీవరెడ్డితో పాటు ఆయన తనయులు వెంకట్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మద్దతుదారులు కూడా వైసీపీలో చేరారు. నంద్యాల వైసీపీ ఇన్‌ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.