: వనస్థలిపురంలో నకిలీ డాక్టర్ అరెస్టు
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నకిలీ డాక్టర్ బ్రహ్మయ్యను ఎస్ఓటీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. సిద్ధార్థ పాలీ క్లినిక్ పేరుతో కొంత కాలంగా ప్రజలను బ్రహ్మయ్య మోసగిస్తున్నాడు. ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేయకుండానే చికిత్స చేస్తున్నాడని పోలీసుల సమాచారం. ఓ మహిళకు ఈ రోజు చికిత్స చేస్తుండగా బ్రహ్మయ్యను అరెస్టు చేశారు. ఈ క్లినిక్ వేరే వారి పేరుపై రిజిస్టర్ అయి ఉందని, ఎటువంటి అనుభవం లేకుండా వైద్యం చేస్తున్నందుకుగాను, బ్రహ్మయ్యపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.