: సినీ పరిశ్రమకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయో తెలిసింది: అకున్ సబర్వాల్
డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న వారంతా విచారణకు హాజరవుతున్నారని... తమతో సహకరిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చి, ఎవరు ఏమి చెప్పినా సమస్య లేదని... తమ వద్ద విచారణకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని చెప్పారు. అందరం కలసి డ్రగ్స్ ముఠా మీద యుద్ధం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ను సేఫ్ అండ్ క్లీన్ సిటీగా మారుస్తామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయో తమకు తెలిసిందని అన్నారు. డ్రగ్స్ వాడుతున్న స్కూలు పిల్లల పేర్లను తాము బయట పెట్టలేదని చెప్పారు.