: విమానంలో దొరికిన ఆ అనుమానాస్పద ప్యాకెట్లలో రెండు కేజీల డ్ర‌గ్స్‌


నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాశ్ర‌యంలో ఎయిరిండియా విమానంలో దొరికిన రెండు అనుమానాస్పద ప్యాకెట్లు క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. భోజనం సరఫరా చేసే ట్రాలీలో ఆ ప్యాకెట్లు లభ్యం కావ‌డంతో వాటిని స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు ద‌ర్యాప్తు చేసి అవి డ్ర‌గ్స్ ప్యాకెట్లేన‌ని తేల్చారు. మొత్తం రెండు కేజీల మార్ఫిన్ మిశ్ర‌మం వాటిలో వుందని చెప్పారు. ఆ విమానం చెన్నై నుంచి వచ్చింద‌ని తెలిపారు. ఫ్లైట్ 440 కేట‌రింగ్ ట్రాలీలో రెండు ప్యాకెట్లు న‌ల్ల టేప్‌తో చుట్టి ఉండ‌గా సిబ్బంది గుర్తించార‌ని వివ‌రించారు. ఈ ప్యాకెట్లను ఎవ‌రు అక్క‌డ‌ ఉంచార‌న్న‌ దానిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News