: కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో రూ.4.5 వేల కోట్లు దోచుకున్నారు: చంద్రబాబు
కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో రూ.4.5 వేల కోట్లు దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో టౌన్ బ్యాంక్ భవనాన్ని, మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని, పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా చేస్తున్నామని అన్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1100 నెంబరుకి ఫోన్ చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో తాము బెల్టు దుకాణాలు లేకుండా చేస్తున్నామని చెప్పారు. ఇసుక విషయంలో కొంతమంది దగా చేసి దోచుకుంటున్నారని, దాన్ని కూడా తాము అరికడుతున్నామని చెప్పారు. అవకతవకలకు పాల్పడినవారిని వదిలేదిలేదని అన్నారు.