: తన భర్తే ఆవుదూడ రూపంలో వచ్చాడని నమ్ముతోన్న బామ్మ!


మనుషులు మరణించిన తర్వాత వారి కర్మలను బట్టి వివిధ రూపాల్లో తిరిగి జన్మిస్తుంటారని చాలామందికి నమ్మకం. కాంబోడియాలో కూడా ఓ బామ్మగారు అలాగే నమ్ముతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... కాంబోడియాలో బౌద్ధమతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. బౌద్ధంలో కర్మ సిద్ధాంతానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో క్రతీ ప్రావిన్స్‌ కి చెందిన కిమ్‌ హాంగ్‌ (74) అనే మహిళ భర్త టోల్‌ ఖుట్‌ ఏడాది క్రితం మృతి చెందారు. ఇటీవల కొద్దిరోజులగా ఆమె ఇంటికి ఓ ఆవు దూడ వస్తోంది.

ఇంటిలోని మొదటి అంతస్తుకు మెట్లపై నుంచి వెళ్తూ బెడ్‌ పై పడుకుంటోంది, అలాగే బెడ్ మీద ఉండే మెత్తటి దిండును తన దగ్గరకు తీసుకుంటోంది. అది చేసే చేష్టలన్నీ తన భర్తను గుర్తుచేస్తున్నాయని ఆమె చెబుతోంది. తన భర్త బతికుండగా ఎలా ప్రవర్తించేవాడో, దూడ అలాగే ప్రవర్తిస్తోందని, అందుకే తన భర్త దూడ రూపంలో వచ్చాడని నమ్ముతున్నానని, దానిని జీవితాంతం రక్షించుకుంటానని ఆమె చెబుతోంది. దీనిని చూసేందుకు రోజూ వంద మంది వరకు వస్తుండగా, సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. 

  • Loading...

More Telugu News