: పూణేలో రక్తపు మడుగులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఫోటోలు, వీడియోలు తీసుకున్న స్థానికులు
రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో పడి, ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బాధను అనుభవిస్తోంటే స్థానికులంతా ఆయన చుట్టూ చేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్న ఘటన పూణేలో చోటు చేసుకుంది. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం అయిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, సతీశ్ ప్రభాకర్ (25) అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కి యాక్సిడెంట్ జరిగింది.
వెంటనే ఆయన చుట్టూ గుమిగూడిన జనం ఆయనను ఆసుపత్రికి తరలించాల్సింది పోయి, ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. కొద్దిసేపటికి ఓ డెంటిస్ట్ ఆ ప్రాంతం గుండా వెళుతూ విషయాన్ని తెలుసుకుని ఓ ఆటోలో బాధితుడిని ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఎంతో ఆలస్యం కావడంతో సతీశ్ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. ఆయనకు జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై వివరాలు తెలియాల్సి ఉంది.