: ఉద్దానం బాధితుల కోసం హార్వార్డ్ వర్సిటీ పరిశోధకులతో పవన్ కల్యాణ్ భేటీ
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోరాటం చిత్తశుద్ధి కలదని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల కోసం పోరాటం చేస్తున్నానని ప్రకటించిన వెంటనే ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అన్నదానిపై పరిశోధించేందుకు హార్వార్డ్ యూనివర్సిటీ డాక్టర్ల టీమ్ రానుంది.
ఈ నేపథ్యంలో ఈనెల 31న వారితో సమావేశమయ్యేందుకు పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్లనున్నారు. వారితో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఆయన కలవనున్నారు.