: 'బిగ్ బాస్' షో ఎంట్రీపై యాంకర్ అనసూయ స్పందన!
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' షోకు టీవీ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. టీఆర్పీ రేటింగుల్లో కూడా ఈ షో అదరగొడుతోంది. ఈ షోకు మరింత ఆకర్షణ కల్పించేందుకు మరింత మంది సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాట్ యాంకర్ అనసూయ, నటి మంచు లక్ష్మిలతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ వార్తలపై అనసూయ స్పందించింది. ప్రస్తుతం తాను సినిమాలు, టీవీ ప్రోగ్రామ్ లతో బిజీగా ఉన్నానని... బిగ్ బాస్ షో చేసేంత సమయం తనకు ఉందని తాను భావించడం లేదని ఆమె స్పష్టం చేసింది.