: సన్నీ లియోన్ కూతురు ఫొటో ఇదిగో!
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్, డేనియల్ వెబర్ దంపతులు ఓ చిన్నారిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ చిన్నారికి ఇద్దరి పేరు కలసి వచ్చేలా నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. సన్నీ లియోన్ అసలు పేరు కరేన్ జిత్ కౌర్ వోహ్రా. దీంతో చిన్నారి పేరులో కౌర్ వచ్చేలా పేరు పెట్టారు. తమ కుమార్తెతో సన్నీ లియోన్ దంపతులు తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, సన్నీలియోన్ చేసిన మంచి పనిని నెటిజన్లు అభినందిస్తున్నారు.