: ద్రావిడ్ తో నాకు ఎలాంటి సమస్య లేదు: రవిశాస్త్రి
స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ రాహుల్ ద్రావిడ్ తో కలసి పని చేసేందుకు తనకు ఎలాంటి సమస్య లేదని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బ్యాటింగ్ కన్సల్టెంట్ గా ద్రావిడ్ ను, బౌలింగ్ కన్సల్టెంట్ గా జహీర్ ఖాన్ ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాస్త్రి మాట్లాడుతూ, ద్రావిడ్ జట్టుతో పాటు ఉంటే ఎంత ప్రయోజనమో అందరికీ తెలిసిందేనని... జట్టు కోసం తగిన సమయాన్ని కేటాయించగలిగితే... అతని సహకారం తీసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. ద్రావిడ్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో బీసీసీఐకి తెలియాలి అని తెలిపాడు. ద్రావిడ్, జహీర్ లకు ఎంతో అనుభవం ఉందని... వారిని అవమానపరిచాలన్న ఉద్దేశం తనకు ఏ కోశానా లేదని స్పష్టం చేశాడు.