: కోవింద్ కు ప్రత్యేక కారును సమకూర్చనున్న కర్ణాటక.. ఖరీదెంతో తెలుసా?


దేశానికి 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ కు ప్రత్యేక కారును సమకూర్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు రాష్ట్రపతి వచ్చినప్పుడల్లా ఈ కారును వినియోగించబోతున్నారు. జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ను రూ. 3.5 కోట్ల వ్యయంతో ఇందుకోసం కొనుగోలు చేయనున్నారు. త్వరలోనే ఈ కారు బెంగళూరుకు చేరనుంది. రాష్ట్రపతే కాకుండా ప్రధానమంత్రి, ఇతర దేశాల అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా ఈ కారును వినియోగించన్నారు.

ఈ కారు ప్రత్యకతలు ఏమిటంటే...
  • ప్రమాదాలపై ముందస్తు సమాచారాన్ని ఇస్తుంది. 
  • 7కు పైగా ఎయిర్ బ్యాగులు ఉంటాయి. 
  • 360 డిగ్రీల కోణంలో పనిచేయగలిగే రహస్య కెమెరాలు. 
  • ఇంటెలిజెన్స్ డ్రైవింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ వ్యవస్థ. 
  • అత్యున్నత స్థాయి బుల్లెట్ ప్రూఫ్ వ్యవస్థ.  

  • Loading...

More Telugu News