: డ్రగ్స్ దందాలో నలుగురు విద్యార్థులు.. అందరూ ఒకే స్కూల్ వారే.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన అధికారులు!


తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో పలువురు విద్యార్థులు కూడా ఉన్నట్టు తేలింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుమారులు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. విమానాశ్రయ నిర్మాణంలో పనిచేస్తున్న అధికారుల కుమారులు, నలుగురు బడా వ్యాపారవేత్తల కుమారులు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తేలింది. డార్క్‌సైట్ల ద్వారా దక్షిణ అమెరికా నుంచి వీరు నేరుగా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్టు బయటపడింది. విద్యార్థులంతా ఒకే స్కూలుకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకుంటున్న నలుగురు విద్యార్థులకు సిట్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News