: నా ఫొటోను చూపెట్టి డ్రగ్ డీలర్ కెల్విన్ అంటారేంటి?: బెంగళూరు నాగబాబు ఆవేదన


డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ని సిట్ అధికారులు నిన్న విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు పూరీ సమాధానమిచ్చారు. డ్రగ్ డీలర్ కెల్విన్ తో పూరీకి ఉన్న పరిచయంపై ఆరా తీసే క్రమంలో ఓ ఫొటోను అధికారులు చూపించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ ఛార్మి రెండేళ్ల క్రితం జరుపుకున్న పుట్టినరోజు వేడుకల్లో కెల్విన్ పాల్గొన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు ఆ ఫొటోను పూరీకి చూపించినట్టు తెలిసిందే.

 అయితే, ఆ ఫొటోలో రెడ్, బ్లూ కాంబినేషన్ లో ఉన్న టీ షర్టు ధరించిన ఓ వ్యక్తి ఉన్నాడు. తాజాగా, ఆ వ్యక్తి స్పందించాడు. ఓ పత్రికా కార్యాలయానికి ఫోన్ చేశాడు. తాను బెంగళూరుకు చెందిన వ్యక్తిని అని, తన పేరు నాగబాబు అని చెప్పాడు. ఈ ఫొటోలో ఉన్న తనను చూపించి డ్రగ్స్ డీలర్ కెల్విన్ అంటూ కొందరు చెబుతున్నారని, అది సబబు కాదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు సంబంధించిన ఫోన్ నంబర్, ఫేస్ బుక్ అకౌంట్ ఖాతా, ఈ-మెయిల్ ఐడీ ని సదరు పత్రికకు తెలియజేసి, విచారణ చేసుకోవాలని కోరినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News