: లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటా: హీరో విశాల్


లక్ష్మీ దేవి లాంటి అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్‌ సంఘం కార్యదర్శి, హీరో విశాల్‌ ప్రకటించాడు. మిష్కన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తుప్పరివాలన్’ చిత్రంలో విశాల్ నటిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ విడుదల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విశాల్ పాల్గొన్నాడు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన పోరాట దృశ్యాలు అద్భుతంగా ఉంటాయని, నటుడిగా, నిర్మాతగా ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. ఈ చిత్రంలో విశాల్ సరసన అను ఇమ్మాన్యూయేల్ నటిస్తుండగా, కె.భాగ్యరాజ్, ప్రసన్న వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News