: ప్లాస్టిక్ సంచిలో రూ.2 కోట్ల విలువైన బంగారం... తరలిస్తూ దొరికిపోయిన వ్యక్తి


పశ్చిమబెంగాల్‌, 24 పరగణ జిల్లాలోని హకీంపుర ప్రాంతంలో రూ. 2 కోట్ల విలువైన 7 కిలోల 60 బంగారు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తూ ఓ వ్య‌క్తి బీఎస్‌ఎఫ్‌ బలగాలకు దొరికిపోయాడు. ఆ బంగారాన్ని బంగ్లాదేశ్‌ నుంచి తీసుకువస్తుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు. ఆ వ్య‌క్తి భార‌త్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న సోనాయి నది ద్వారా త‌ర‌లిస్తున్నాడ‌ని వివ‌రించారు. ఓ వ్య‌క్తిపై ఆనుమానం వ‌చ్చి అత‌డి వ‌ద్ద ఉన్న‌ ప్లాస్టిక్‌ సంచిని సోదా చేయగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు. ఈ బంగారం విష‌యమై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.    

  • Loading...

More Telugu News