: దళిత బిడ్డ, విద్యా కోవిదుడు రాష్ట్రపతి కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది: పవన్ కల్యాణ్
దళిత బిడ్డ, విద్యాకోవిదుడు రామ్‌నాథ్ కోవింద్ భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికకావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. భారతదేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ఆయన మేలైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ తరఫున, తన తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.