: ‘ఫిదా’ నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది: హీరో వరుణ్ తేజ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘మెగా’ ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ హీరోగా రూపొందించిన చిత్రం ఫిదా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం విజయవాడలోని కనకదుర్గమ్మను ఈ రోజు దర్శించుకుంది. అనంతరం, ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తన కెరీర్ లో ‘ఫిదా’ టర్నింగ్ పాయింట్ అవుతుందని, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, అమెరికా గురించి తనకు తెలిసిన విషయాలెన్నో ఈ చిత్రంలో చూపించానని, కుటుంబ నేపథ్యంలో సాగే కథా చిత్రమని అన్నారు.