: డ్రగ్స్ అలవాటుకు స్వస్తి చెప్పండి: సినీ నటి తాప్సీ
డ్రగ్స్ తీసుకునే వారు ఆ అలవాటుకు వెంటనే స్వస్తి పలకాలని ప్రముఖ సినీ నటి తాప్సీ పిలుపు నిచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ లో పలువురి పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, చాలా చోట్ల డ్రగ్స్ వాడకం పెరిగిందని, ఒకరిని చూసి మరొకరు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని చెప్పింది. ప్రస్తుతం దేశం మొత్తాన్ని డ్రగ్స్ మహమ్మారి కుదిపేస్తోందని, తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించింది. డ్రగ్స్ కు సంబంధించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తాప్సీ అభిప్రాయపడింది.