: మహేశ్ బాబు కూతురితో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో!
టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు కూతురు సితార ఈ రోజు తన ఐదవ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలిపింది. సితారతో కలిసి తాను గతంలో దిగిన ఓ ఫొటోను ఆమె ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సితార ఎల్లప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొంది. మరో హీరోయిన్ కాజల్ కూడా సితారకు హ్యాపీ బర్త్ డే చెప్పింది. ఆమెను యువరాణిగా అభివర్ణించింది. ట్విట్టర్ లో మహేశ్ బాబు ఫ్యాన్స్ సితారపై శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.