: మీరాకుమార్‌కు కూడా కంగ్రాట్స్ చెప్పిన మోదీ!
ప్రతిపక్షం తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడి ఓడిపోయిన అభ్యర్థి మీరాకుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ కంగ్రాట్స్ తెలిపారు. ఆమె తన ప్రచారంలో ప్రజాస్వామ్య సంప్రదాయం, భావజాలం, విలువలే అజెండాగా తీసుకోవడాన్ని మోదీ అభినందించారు. తమకు వ్యతిరేకంగా పోటీ చేసినా కూడా మీరాకుమార్‌కు మోదీ అభినందనలు తెలియజేయడం వారి వర్గ సభ్యుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 65.65 శాతం ఓట్లతో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి ఎన్నికైన సంగతి తెలిసిందే!