: ఈ రోజు నాకు ఎంతో ఉద్విగ్నభరితమైన రోజు: కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
రాష్ట్రపతి ఎన్నికల్లో 65 శాతానికి పైగా ఓట్లు సాధించి గెలుపొందిన రామ్‌నాథ్ కోవింద్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించి ఆ పదవికి ఎంతో మంది వన్నెతెచ్చారని ఆయన పేర్కొన్నారు. తాను కూడా వారిలాగే బాధ్యతలు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. తనకు బాసటగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వ్యాఖ్యానించారు. రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌నాథ్ ఆ పదవికి తగిన వ్యక్తని పేర్కొన్నారు.