: పది మంది తప్పు చేస్తే.. అందరూ చేసినట్టు కాదు: దిల్ రాజు
సినీ పరిశ్రమలో పది మంది తప్పు చేస్తే... అందరూ చేసినట్టు కాదని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. డ్రగ్స్ వ్యవహారం గురించి తమకంటే మీడియాకే ఎక్కువ తెలుసని ఆయన అన్నారు. మీడియా ద్వారానే తాను కూడా డ్రగ్స్ గురించిన విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పారు. డ్రగ్స్ తో పాటు, ప్రజలకు మేలు చేసే అన్ని అంశాల గురించి చిత్ర పరిశ్రమ ద్వారా ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ రోజు 'ఫిదా' చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.