: అనుమతి లేకుండా హైదరాబాద్ వదలొద్దు.. శ్యాం కె నాయుడికి అధికారుల ఆదేశాలు!
డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడిని తమ అనుమతి లేకుండా హైదరాబాద్ వదలి వెళ్లొద్దని సిట్ అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరో మారు విచారణకు హాజరుకావాలని శ్యాం కె నాయుడుకి అధికారులు చెప్పినట్టు సమాచారం. కాగా, డ్రగ్స్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని, నోటీసులు అందుకున్న వారు విచారణకు సహకరించాలని కోరుతున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్ర వదన్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆధారాలు లభిస్తే ఎవరిపైన అయినా సరే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.