: 2 వేల కరెన్సీ నోట్ల పంపిణీ తగ్గింది..!


పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత మార్కెట్లోకి భారీ ఎత్తున 2వేల విలువైన నోట్లను రిజర్వ్ బ్యాంక్ పంపిణీ చేసింది. ఒకానొక సందర్భంలో జేబులో 2 వేల నోటు ఉన్నా... చిల్లర దొరక్క జనాలు పిచ్చెక్కిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఆ తర్వాత 500 విలువైన నోట్లు రావడం, 100 విలువైన నోట్లు విరివిగా మార్కెట్లోకి రావడంతో, జనాల కష్టాలు తొలగిపోయాయి. తాజాగా, 2వేల విలువైన కరెన్సీ సరఫరాను ఆర్బీఐ తగ్గించి వేసింది. ఇదే సమయంలో 500 విలువైన కరెన్సీని ఎక్కువగా మార్కెట్లోకి తెస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది.

2వేల విలువైన నోట్లు రీసర్క్యులేషన్ కిందనే తిరిగి తమ వద్దకు వస్తున్నాయని... ఆర్బీఐ నుంచి కొత్తగా నోట్లు రావడం లేదని ఎస్బీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ వ్యాస్ కూడా తెలిపారు. 

  • Loading...

More Telugu News