: తప్పిపోయిన కుక్కపిల్లను వెతకడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తోన్న జంట!


ఎవరైనా పిల్ల‌లు క‌నిపించకుండా పోతే వారిని వెత‌క‌డానికి ఎంతో ఖర్చు చేస్తారు. వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి పోస్ట‌ర్లు వేయించి, త‌ప్పిపోయిన వారి ఆచూకీ తెలిపితే ప్రోత్సాహం ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తారు. అయితే, ఇంట్లో పెంచుకుంటున్న‌ కుక్క పిల్ల‌ త‌ప్పిపోతే? దాని కోసం మిస్సింగ్ పోస్ట‌ర్లు వేయించ‌డం అరుదనే చెప్పాలి. కానీ, అమెరికాలోని సౌత్‌ ఫ్లోరిడాకు చెందిన ఓ జంట మాత్రం దానిని వెతకడం కోసం ఇప్పటి వరకు రూ.4.2 లక్షలు ఖర్చు చేసింది. ఎన్నో పోస్టర్లు అంటించి దాని కోసం ఇంకా వెతుకుతోంది.

త‌మ కుక్క ఎక్క‌డ‌యినా క‌నిపిస్తే ద‌య‌చేసి త‌మ‌కు తెలియ‌జేయాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా వేడుకుంటోంది. జస్టిన్‌ మైజ్‌ కుటుంబం ఆ కుక్క పిల్ల‌కు ‘టైగర్‌’ అనే పేరు పెట్టి పెంచుకుంటోంది. మైజ్ వాకింగ్‌కు వెళుతున్న సమయంలో ఆయ‌న వెంట వెళ్లిన ఆ కుక్క పిల్ల త‌ప్పిపోయింది. ఫిర్యాదు అందుకున్న అక్క‌డి ట్రాకింగ్‌ సర్వీస్‌ సభ్యులు కూడా టైగర్ జాడ‌ను ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపెట్టలేక‌పోయారు.

  • Loading...

More Telugu News