: సరబ్ జిత్ న్యాయవాదికి తాలిబాన్ల బెదిరింపులు


లాహోర్ జైల్లో సహచర ఖైదీల దాడిలో గాయపడి ప్రాణాలు విడిచిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ కేసులు వాదిస్తోన్న న్యాయవాది అవైస్ షేక్ ను తాలిబాన్లు బెదిరిస్తున్నారని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. గూఢచర్యంతో పాటు బాంబు పేలుళ్ళ కేసులో ఉరిశిక్ష పడిన సరబ్ జిత్ కు అవైస్ షేక్ న్యాయ సహాయం అందిస్తున్నారు. కాగా, అవైస్ కు అతని కుటుంబానికి ఇటీవల కాలంలో తెహ్రీక్-ఏ-తాలిబాన్ నుంచి పలు బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని మానవ హక్కుల సంఘం తెలిపింది.

అవైస్ షేక్ కు రక్షణ కల్పించాలంటూ పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని మానవ హక్కుల సంఘం అభ్యర్థించింది. సరబ్ జిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చూసేందుకు వచ్చిన అతని కుటుంబ సభ్యులను వాఘా సరిహద్దు నుంచి అవైస్ షేక్ తోడ్కొని వచ్చాడు.

  • Loading...

More Telugu News