: దిగ్విజయ్ సింగ్ పై మండిపడ్డ మంచు లక్ష్మి
తెలంగాణ డ్రగ్స్ ఊబిలో కూరుకుపోయిందని... భారీ డ్రగ్స్ స్కామ్ జరిగిందని, ఇందులో ఇరుక్కున్న వ్యక్తులకు టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ కు మంత్రి కేటీఆర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల నుంచి రిటైరై, వయసుకు తగ్గ పనులు చేసుకోవాలంటూ కేటీఆర్ సూచించారు.
ఈ నేపథ్యంలో దిగ్విజయ్ పై సినీ నటి మంచు లక్ష్మి కూడా మండిపడింది. రామ్ (కేటీఆర్) చెప్పినట్టుగానే దిగ్విజయ్ ఎప్పుడో మతి స్థిమితం కోల్పోయారంటూ ట్వీట్ చేసింది.