: నిజాలు బయటకు రాకుండా మీడియా సంచలనం చేయడం తగదు: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్
డ్రగ్స్ వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు నిన్న విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం, మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన పూరీ, నిన్న రాత్రి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. ఒక విషయానికి సంబంధించి పూర్తి నిజాలు బయటకు రాకముందే ప్రజలు, మీడియా దాన్ని సంచలనం చేయకూడదని తెలుసుకోవాల్సిన సమయమిది అని ప్రకాశ్ రాజ్ అన్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలు తనను ఎంతో బాధించాయని, డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు వచ్చినప్పటి నుంచి తన తల్లి, భార్య, పిల్లలు ఏడుస్తూనే ఉన్నారని పూరీ జగన్నాథ్ తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.