: మాయావతి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్


బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. ఉత్తరప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులపై మాట్లాడేందుకు తనను అనుమతించడం లేదని... ఇలాగైతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ నిన్న రాజ్యసభ నుంచి ఆమె కోపంగా వెళ్లిపోయారు. అయితే, సరైన ఫార్మాట్ లో మాయావతి రాజీనామా లేఖ లేకపోవడంతో, ఆమె రాజీనామాను ఆమోదించకపోవచ్చనే వార్తలు కూడా వెలువడ్డాయి. మరో ఆరు నెలల్లో మాయావతి పదవీకాలం ముగియనుండటం గమనార్హం. 

  • Loading...

More Telugu News