: షూటింగ్ అయ్యాక ఏడ్చేసిన మోహన్‌లాల్!... వీడియో చూడండి
మలయాళ నటుడు మోహన్ లాల్ నటప్రతిభ మరోసారి రుజువైంది. ఆయన పాత్రలో నటించడం కాదు జీవిస్తారని చెప్పడానికి ప్రస్తుతం ఆయన నటిస్తున్న `వెలిపాడిందే పుస్తకం` చిత్రం షూటింగే నిదర్శనం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి బయటికొచ్చింది. ఇందులో మోహన్‌లాల్ కూతురి శవాన్ని మోసుకొస్తూ ఏడ్చే సీన్ ఒకటి తీస్తున్నారు. దర్శకుడు లాల్ జోస్ `యాక్షన్` అనగానే మోహన్‌లాల్ ఏడ్వడం ప్రారంభించారు.
తర్వాత `కట్` చెప్పాక సీన్ బాగా వచ్చిందని అందరూ మోహన్ లాల్ నటనను ప్రశంసిస్తుంటే, ఆయన మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సన్నివేశాన్ని ఎంతలా మనసుకు తీసుకుంటే అలా ఏడుపొస్తుందంటూ వీడియో చూసిన వాళ్లందరూ మోహన్‌లాల్ నటనను మెచ్చుకుంటున్నారు. ఇంత అంకితభావంతో పనిచేసే నటుడు ఉండటం మనకు దొరకడం అదృష్టమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.