: మీడియాతో కోహ్లీ మాట్లాడుతున్న వేళ.. మధ్యలోనే కట్ చెప్పిన బీసీసీఐ!


శ్రీలంక పర్యటన కోసం టీమిండియా సేన నిన్న ముంబై నుంచి కొలంబోకు బయలుదేరే ముందు బీసీసీఐ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రితో 15 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు వీరు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. ఇంతలో కుంబ్లే రాజీనామా గురించి, కుంబ్లేతో ఉన్న విభేదాల గురించి కోహ్లీని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కోహ్లీ మాట్లాడుతుండగానే సమావేశం ముగిసిందని బీసీసీఐ నిర్వాహకులు ప్రకటించారు. సమయం ముగిసిపోయిందని చెప్పారు. దీంతో, అక్కడ నుంచి కోహ్లీ, రవిశాస్త్రిలు వెళ్లిపోయారు. మరోవైపు, కోహ్లీ సేన కొలంబో చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 26వ తేదీన తొలి వన్డే ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News