: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం... 20 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఓ ప్రైవేటు బస్సు ఇరుకైన దారిలో ప్రయాణిస్తూ, లోయలో పడిపోయిన ఘోర దుర్ఘటనలో 20 మంది మరణించారు. కిన్నార్ నుంచి సోలన్ వెళుతున్న బస్సు షిమ్లాకు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖన్ తేరీ వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీములు రామ్ పూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టాయి. బస్సులో నుంచి మృతదేహాలను వెలికితీసిన అధికారులు, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.