: మా జైళ్లు కూడా మీ జైళ్ల మాదిరిగా బాగుంటాయి.. మాల్యాను జాగ్రత్తగా చూసుకుంటాం: బ్రిటన్ కోర్టుకు తెలిపిన ఇండియా
ఇండియాలో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టి, ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను తిరిగి భారత్ కు అప్పగించాలని వాదిస్తున్న ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లండన్ లోని జైళ్లకు మాదిరిగానే, భారత్ లోని జైళ్లు కూడా బాగుంటాయని, మాల్యాను జాగ్రత్తగా చూసుకుంటామని బ్రిటన్ కోర్టులో భారత్ తరఫున వాదనలు వినిపించేందుకు వెళ్లిన మేహర్షి వ్యాఖ్యానించారు. ఆయన్ను జైల్లో వీఐపీగా ట్రీట్ చేయకపోయినా, యూరప్ లోని జైళ్ల మాదిరే అన్ని సౌకర్యాలూ ఉంటాయని తెలిపారు. కాగా, మాల్యాను ఇండియాకు తీసుకువస్తే, ఆయన్ను గౌరవంగా చూసుకునేందుకు ఆర్థర్ రోడ్ జైల్లో మార్పులు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే జైల్లో మహారాష్ట్ర మాజీ మంత్రి చగన్ భుజ్ బల్ సహా పలువురు వీఐపీలు శిక్షను అనుభవించిన సంగతి తెలిసిందే.